దిశ ఘటనకు నిరసనగా… హైకోర్టు వద్ద లాయర్ల జేఏసీ క్యాండిల్ ర్యాలీ

దిశపై అత్యాచారం, హత్యకు నిరసనగా… రాష్ట్ర లాయర్ల జేఏసీ హైకోర్టు వద్ద నిరసన తెలిపింది. ఇందుకుగాను క్యాండిల్ ర్యలీ చేసింది. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని… దిశ నిందితులకు ఉరి శిక్ష వేయాలని, అత్యాచారం, హత్య నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ పెంచాలని.. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో అత్యాచారం, హత్య ఘటనలపై స్పెషల్ బెంచ్ లు ఏర్పాటు చేసి భాదితులకు సత్వర న్యాయం చేయలని, పార్లమెంట్ లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో కూడా మార్పులు చేయాలని అన్నారు.

Latest Updates