కన్న కూతుర్ని గొంతు కోసి హత్య

సంగారెడ్డి: నాలుగేళ్ల కూతురిని గొంతు కోసి చంపిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పుల్కల్ మండలం గోంగులూర్ గ్రామానికి చెందిన రమావత్ జీవన్ అనే వ్యక్తి తన కూతురు అవంతిక (4)ను నిద్రపోతుండగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్న జీవన్ .. లాక్డౌన్ విధించినప్పటి నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. నిస్సహాయ స్థితిలో.. జీవన్ బాలికను చంపినట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

 

Latest Updates