ఇంటర్నేషనల్ టాలెంట్ షోకు తెలంగాణ వాసి

సూర్యాపేట:  తెలంగాణ వాసికి అరుదైన అవకాశం దక్కింది. సూర్యాపేటకు చెందిన డ్రిల్లింగ్ మ్యాన్ క్రాంతి కుమార్ కి అంతర్జాతీయ టాలెంట్ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కింది. ఫిబ్రవరి- 9వ తేదీన లాస్ ఏంజెల్స్‌ లో జరిగే అమెరికాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో ఆడిషన్ ఇచ్చే అవకాశం తెలంగాణ బిడ్డ, సూర్యాపేట నివాసిని వరించింది. ఇప్పటికే స్థానిక, జాతీయ స్థాయిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని క్రాంతి తన అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నాడు. వేడి నూనెలో చేతులు పెట్టడం, డ్రిల్లింగ్ మిషన్‌ తో ముక్కులో డ్రిల్ చేసుకోవడం, ఒకేసారి 32 పదునైన కత్తులను నోట్లోకి మింగడం వంటి  సహాస కృత్యాలు క్రాంతి చేస్తుంటాడు.

ఆహ్వానం అందినా, అమెరికా వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని క్రాంతి ఆశ్రయించాడు. క్రాంతి టాలెంట్‌ ను మెచ్చిన ఎమ్మెల్యే అమెరికా వెళ్లేందుకు కావాల్సిన ఆర్థిక చేయూతను అందించనున్నట్లు తెలిపారు.

Latest Updates