మంత్రి హరీశ్‌ రావుకు నెగిటివ్

హైదరాబాద్‌: కరోనా నుంచి రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కోలుకున్నారు. శనివారం కరోనా పరీక్షల్లో హరీశ్ ‌రావుకు నెగిటివ్ వచ్చినట్లు నిర్ధారించినట్లు తెలిపారు డాక్టర్లు. హైదరాబాద్ లోని కోఠి హాస్పిటల్ లో నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో.. హరీశ్ రావుకు నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు ప్రకటించారు డాక్టర్లు.

సెప్టెంబర్- 4న హరీశ్ ‌రావుకు పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్‌ లో ట్రీట్ మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. అప్ప‌ట్నుంచి వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తూ హ‌రీష్‌రావు క‌రోనాను జ‌యించారు. దీంతో ఆయ‌న సోమ‌వారం నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Updates