శాసనమండలి నిరవధిక వాయిదా

శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. వాయిదా కంటే ముందు.. మండలి చైర్మన్ స్వామిగౌడ్.. కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాద మృతులకు, కేరళ వరదల్లో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్వామిగౌడ్ ప్రకటించారు. మండలి ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్.. మాజీ ప్రధాని వాజ్‌పేయి, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టి సంతాపం తెలిపారు.

Latest Updates