మా ఆయన బంగారం.. ఓటేయండి.

Telangana MP candidates wives conducting election campaign in their constitutions
  • చేవెళ్ల, సికింద్రాబాద్‌ , మల్కాజిగిరిలలో ఓట్లు అభ్యర్థిస్తున్న క్యాండిడేట్ల భార్యలు
  • కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి కొండంత బలం సంగీతారెడ్డి
  • అంజన్‌ కుమార్‌ వెంటే నాగమణి
  • కిషన్‌ రెడ్డికి చేదోడు వాదోడుగా కావ్యా రెడ్డి
  • రాజశేఖర్‌ రెడ్డికి తోడూ నీడా మమతా రెడ్డి.

‘ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది’ అన్న మాట  లోక్‌ సభకు పోటీ చేస్తున్న అభ్యర్థు ల విషయంలో నిజమయ్యే అవకాశాలున్నాయి. చేవెళ్ల, సికింద్రాబాద్‌ , మల్కాజిగిరిల నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల భార్యలు వారి భర్తల గెలుపు కోసం ప్రచారం చేస్తు న్నారు . ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఓట్లడుగుతూ తిరుగుతున్నారు. గల్లీలు, బస్తీల్లో వారి పార్టీ గుర్తు ను చూపుతూ తప్పక ఓటెయ్యాలని అభ్యర్థిస్తు న్నారు . ఎండలు మండుతున్నా పట్టించుకోకుండా పాదయాత్రలు, ర్యాలీలు తీస్తూ ఇంటింటికీ వెళ్లి భర్తల కోసం తెగ కష్టపడుతున్నారు

పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల పక్షాన వారి భార్యలు ప్రచారం చేస్తున్నారు. పతుల గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టు పెడుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్​రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  డా.జి.రంజిత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి జనార్దన్‌ రెడ్డి, మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ రాం చందర్‌ రావు, జనసేన అభ్యర్థి మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్‌నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరుల సతీమణులు ప్రచారంలో దూసుకుపోతున్నారు .అదే విధంగా టీఆర్ఎస్‌ అభ్యర్థి  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తనయుడు సాయికుమార్‌కు మద్దతుగా తల్లి స్వర్ణ  ప్రచారంలో నిమగ్నమయ్యారు.

చేవెళ్లలో..

నియోజకవర్గంలోని గడపగడపకూ తిరుగుతూ కొండా విశ్వేశ్వర్​రెడ్డి భార్య సంగీతారెడ్డి ఓట్లుఅడుగుతున్నారు . ఆమె ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారు . అపోలో ఆసుపత్రి ఎండీగా ఉన్నసంగీతారెడ్డి శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మహిళలను కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు . అలాగే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్ రెడ్డి భార్య సీతారెడ్డికూడా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు . స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి జనార్దన్‌ రెడ్డి భార్య జయవాణి రెడ్డి  ప్రచారంలో దూసుకుపోతుంది.

సికింద్రాబాద్ లో…

ఇక్కడ టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి భార్య కావ్య రెడ్డి భర్త గెలుపు కోసం స్థానిక కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు . కాంగ్రెస్‌ అభ్యర్థి అంజన్‌కుమార్‌ యాదవ్‌ భార్య నాగమణికి స్థానిక ఓటర్లతో మంచి పరిచయం ఉంది. భర్త గెలుపుకోసం ఒక్కరే ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు . టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  తలసాని సాయికుమార్‌ గెలుపు కోసం తండ్రి మంత్రి  శ్రీనివాస్‌ యాదవ్‌,తల్లి  స్వర్ణ ప్రచారం కొనసాగిస్తున్నారు . తలసాని సాయి స్థానికులు కావడంతో తమకున్న బలాన్నినిరూపించేందుకు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

మల్కాజిగిరిలో…

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి భార్య మమత రెడ్డి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు . అలాగే మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌ పరిధిలో పెద్దఎత్తున్న విద్యాసంస్థలు ఉన్నాయి. దీంతో మంత్రి మల్లారెడ్డి కుతూరు మమత రెడ్డికి నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. ఇదే బాటలో జనసేన అభ్యర్థి మహేందర్‌ రెడ్డి భార్య స్వాతిరెడ్డి ప్రచారంలోదూసుకుపోతున్నారు . కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు . బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు భార్య ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి భార్య గీతారెడ్డి ఇంకా ప్రచారరంగంలోకి దిగలేదని తెలుస్తోంది.

Latest Updates