నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా

రాజ్యసభ ఎంపీలు కేవీపీ, కేకేల ఎక్స్ అఫీషియో ఓట్లు వివాదంగా మారింది. కేకే ఆంధ్రా కోటాలో ఎంపీగా ఉన్నారు. కేవీపీ తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడే వివాదం మొదలైంది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కేవీపీ అప్లికేషన్ పెట్టుకోవడం..అధికారులు తిరస్కరించడం జరిగిపోయింది. తెలంగాణ కోటాలో ఉన్న తనను ఎక్స్ అషీషియో సభ్యుడిగా అనుమతి ఇవ్వకపోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తర్వాత అనుమతి ఇచ్చారు. కేవీపీ ఓటుపై టీఆర్ఎస్ అభ్యంతరం చెప్పడంతో..నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సాయంత్రానికి వాయిదా పడింది.

మరోవైపు ఆంధ్రా కోటాలో ఉన్న కేకే..తుక్కుగూడలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు. ఏపీ కోటాలో ఉన్న కేకేకు..ఎక్స్ అఫీషియో గుర్తింపు ఎలా ఇస్తారని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం కావడంతో..ఉద్రిక్తంగా మారాయి. నేరేడుచర్లలో కాంగ్రెస్, తుక్కుగూడలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి.

Latest Updates