టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఓ మహిళ ఓటు వేసేందుకు వెళ్తుండగా టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్‌ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ది ఇలాయస్ అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణ లో ఇమ్రాన్‌ ముక్కును, వేళ్లను ఇలాయస్ కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. అక్కడున్న వారు ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి  ఇమ్రాన్ ను ఎమ్మెల్యే షకీల్ పరామర్శించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Telangana municipal elections: congress candidate bites trs candidates nose

Latest Updates