కొత్త గవర్నర్ ప్రమాణం తేదీ ఖరారు

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం తేదీ ఖరారైంది. తమిళనాడుకు చెందిన బీజేపీ ప్రెసిడెంట్ తమిళిసై సౌందరరాజన్ ను ఇటీవలే తెలంగాణ గవర్నర్ గా నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం ఉంటుందని అధికార వర్గాలు ప్రకటించాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్ .. గవర్నర్ తో ప్రమాణం చేయించనున్నారు.

రాజ్ భవన్ లో జరిగే గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు, ఆహ్వానాలు పంపే ఏర్పాట్లలో రాజ్ భవన్, జీఏడీ, ప్రొటోకాల్ అధికారులు బిజీగా ఉన్నారు.

కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై BRK భవన్ లో GAD, ప్రోటోకాల్ అధికారులు ఈ ఉదయం సమావేశం అయ్యారు. ఓత్ టేకింగ్ సెర్మనీ ఏర్పాట్ల పై డిస్కస్ చేశారు.

Latest Updates