తెలంగాణ కొత్త ఓటరు జాబితా ఇదే..!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జనవరి,1, 2021 నాటికి 3,01,65,569 (మూడుకోట్ల ఒక లక్షా అరవైఐదువేల ఐదు వందల అరవై తొమ్మిది) మంది ఓటర్లుగా నమోదైనట్టు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత ఎన్నికల కమిషన్‌ అనుమతితో శుక్రవారం ఈ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. మొత్తం 34,708 పోలింగ్‌స్టేషన్లు ఉన్నట్టు తెలిపింది.

ఇక ఓటర్లలో మహిళా ఓటర్ల సంఖ్య 1,51,61,714 మంది కాగా పురుషుల సంఖ్య 1,50,02,227 మంది ఉన్నట్టు చెప్పింది. ఇందులో థర్డ్ ‌జెండర్‌ ఓటర్లు 1,628 మంది నమోదైనట్టు తెలిపింది. కొత్తగా 2,82,492 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సర్వీస్‌ ఓటర్లుగా 13,703 మంది నమొదైనట్టు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం.

Latest Updates