కరోనాతో సౌదీలో తెలంగాణ యువకుడు మృతి

సౌదీ అరేబియాలో కరోనాతో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన 38 సంవత్సరాల వయస్సు గల యువకుడు మృతిచెందాడు. ఈ యువకుడు 15 రోజుల క్రితం జ్వరం, జలుబుతో బాధపడ్డాడు. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారడంతో తోటివారు ఈ నెల 25న అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు బుధవారం మృతిచెందాడు. మృతదేహానికి కరోనా పరీక్ష చెయ్యగా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేలా చూడాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

For More News..

మద్యంమత్తులో రైల్వే ఉద్యోగిపై రౌడీ షీటర్ దాడి

పనివాళ్లను ఫ్లైట్లో సొంతూరికి పంపించిన యజమాని

హోటళ్లో అగ్ని ప్రమాదం.. లోపల 25 మంది కరోనా డాక్టర్లు

Latest Updates