గోల్డ్‌ మెడల్స్ తో అదరగొట్టిన వివేక్ తేజ

యూఎస్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ లో రెండు మెడల్స్‌ సాధించి తెలంగాణ ప్లేయర్‌‌‌‌ వివేక్‌తేజ అదరగొట్టాడు. ఇండివిడ్యూవల్‌, టీమ్‌కు మిటే విభాగంలోనూ గోల్డ్‌‌‌‌ మెడల్స్‌ తో సత్తాచాటాడు. ఈ టోర్నీలో కెనడా, మెక్సి కో, అమెరికా, కోస్టారికాలకు చెందిన ప్లేయర్లను ఓడించి ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీ ఈనెల17 నుంచి 21 వరకు అమెరికాలోని లాస్‌ వెగాస్‌ లో జరిగింది. ఈ టోర్నీలో కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తరపున టీమిండియాకు తను ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికే ఇండియాకు చెందిన ఏడు ప్రాచీనయుద్ధ క్రీడల్లో నైపుణ్యం పొందిన వివేక్.. త్వరలోనే ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగుపెట్టనున్నాడు.  ఒలంపిక్స్ లో భారత్ తరపున బాక్సింగ్ లో ప్రాతినిథ్యం వహించడమే తనలక్ష్యమని వివేక్ తేజ పేర్కొన్నాడు.

Latest Updates