డాక్టర్ల సెక్యూరిటీ కి వాట్సాప్ గ్రూప్స్

కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న మెడికల్, పారామెడికల్ సిబ్బంది సెక్యూరిటీకి పోలీస్ డిపార్ట్ మెంట్ పటిష్ట ఏర్పాట్లు చేసింది. డ్యూటీ టైమ్ లో వారికి ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించే విధంగా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయాలని ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్ల పరిధిలో పోలీసులు, వైద్యారోగ్య సిబ్బందితో లోకల్ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు . కరోనా నివారణ విధులు నిర్వహించే హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్ల సేవలు అందిస్తున్న వారిని మెంబర్స్ గా చేర్చాలని సూచించారు. సస్పెక్టర్స్ డీటెయిల్స్ సేకరించే సమయంలోనూ దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Latest Updates