దేశంలోని టాప్‌టెన్ పోలీస్ స్టేషన్లలో తెలంగాణ పోలీస్ స్టేషన్

దేశంలోని బెస్ట్ టాప్‌టెన్ పోలీస్ స్టేషన్లలో తెలంగాణ పోలీస్ స్టేషన్‌కు చోటుదక్కింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ పదోస్థానాన్ని దక్కించుకుంది. దేశంలోని టాప్‌టెన్ పోలీస్ స్టేషన్లలో తెలంగాణ పోలీస్ స్టేషన్‌కు చోటుదక్కడం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న మరియు పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీతత్వాన్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా పది అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఎంపిక చేస్తుంది. అందులో భాగంగా 2020 సంవత్సరానికి గాను ఎంపిక చేసిన పది ఉత్తమ పోలీస్ స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసింది. 2019లో కూడా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని చొప్పదండి పోలీస్ స్టేషన్ 7వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలిచింది. వరుసగా రెండోసారి కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలవడం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి.. కరీంనగర్ కమీషనర్ వీ.బీ. కమలాసన్ రెడ్డి, జమ్మికుంట స్టేషన్ హౌస్ అధికారితో పాటు ఇతర పోలీసులను అభినందించారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు దక్కిన ఈ పురస్కారాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లు కూడా ఉత్తమ పౌర సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు.

కాగా.. బెస్ట్ పోలీస్ స్టేషన్లలో మొదటిస్థానాన్ని మణిపూర్‌లోని నొంగ్‌పొక్ సెక్మై పోలీస్ స్టేషన్ కైవసం చేసుకుంది. రెండోస్థానంలో తమిళనాడులోని సురమంగళం పోలీస్ స్టేషన్, మూడో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖార్సంగ్ పోలీస్ స్టేషన్ నిలిచాయి.

For More News..

డిసెంబర్ 31న కొత్త పార్టీపై రజినీకాంత్ ప్రకటన

ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు పూర్తి

నగరంలో 92 మంది పోలీసుల సస్పెన్షన్ నిజం కాదు

Latest Updates