ఒకే విడతలో రూ.లక్ష రుణ మాఫీ కావాలె

Telangana Raithu sangham demand to State Government

తెలంగాణ రైతు సంఘం డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ ఏకకాలంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చేసింది. సోమవారం హైదరాబాద్​లో సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ. సాగర్, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి లు మీడియాతోమాట్లాడారు. ఎన్నికలప్పుడు రుణమాఫీ ప్రకటన చేసి గాలికి వదిలేసిందని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో రైతులకు ఇవ్వాల్సిన వడ్డీ మాఫీ వర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా రూ. లక్ష రుణమాఫీ చేయడంతో.. అది వడ్డీకే సరిపోతోందన్నారు. వానాకాల పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, రాళ్ల వానల వల్ల నష్టాల సమాచారం సేకరించి పరిహారం ఇవ్వాలని డిమాం డ్ చేశారు.

Latest Updates