అమరులకు రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల ఒకరోజు వేతనం

హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు అన్నివర్గాల ప్రజలు ముందుకొస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే వ్యక్తిగతంగా రూ.25లక్షల సాయం అందించారు. తన స్నేహితులు మరో రూ.25లక్షల సాయం అందించారని చెప్పారు. పలు ప్రభుత్వ శాఖలు కూడా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాయి. తాజాగా రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కూడా ముందుకొచ్చింది. తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రకటించారు. వీర సైనికుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి.. అటెండర్ , వీఆర్వో, తహశీల్దార్ వరకు ఒకరోజు మూలవేతనం అందిస్తున్నట్టు చెప్పారు.

Latest Updates