పలు సమస్యలు పరిష్కరించాలని..  సీఎస్ కు ట్రెసా బృందం విజ్ఞప్తి

హైదరాబాద్: దసరా రోజున భూ హక్కుల పోర్టల్ ధరణి వెబ్ సైట్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులు. రెవెన్యూ శాఖకి అదనంగా రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నందున  పలు  రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సీఎస్ ను కోరారు ట్రెసా నాయకులు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

-రిజిస్ట్రేషన్ విధులు అప్పగిస్తున్నందున కొత్త ఆఫీస్ పాటర్న్ (సిబ్బంది)ని రూపొందించాలి

-కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పెరుగుదలకు అనుగుణంగా అన్ని రకాల  పోస్టులు(కేడర్ స్ట్రెంత్) పెంచాలి

-రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్ట్ లు భర్తీ చేయాలి.

-పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని వీఆర్వో వ్యవస్థ రద్దయిన క్రమంలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లను పెంచి శాఖను బలోపేతం చేయాలి

-జిల్లా పాలనలో కీలకమైన DRO పోస్టును యధాతదంగా కొనసాగించాలి

-జాయింట్ కలెక్టర్ నుండి మారిన అడిషనల్ కలెక్టర్ పోస్టుకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ ను రూపొందించాలి

-నాయబ్ తహసీల్దార్ నుండి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వరకు చేపట్టిన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలి

-తహసీల్దార్ల వెహికల్ బడ్జెట్ తో పాటు కార్యాలయ నిర్వహణకు సరిపడ బడ్జెట్ రెగ్యులర్ గా కేటాయించాలి

– బకాయిలను వెంటనే విడుదల చేయాలి

-ప్రభుత్వం వీఆర్ఏ లకు స్కేలు ప్రకటించిన దృష్ట్యా వాటి అమలుకు తగు మార్గదర్శకాలు విడుదల చేయాలి

-టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులలో దీర్ఘకాలికంగా పని చేస్తున్న ఆపరేటర్ల సేవలను గుర్తించి వారి సర్వీస్ ను  రెగ్యులరైజ్  చేయాలి

ఈ సందర్బంగా చీఫ్ సెక్రటరీ ఈ విషయాలన్నింటిపై సానుకూలంగా స్పందించి, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ట్రెసా నాయకులు. అలాగే సీఎం కేసీఆర్  ఆదేశాలకు అనుగుణంగా,  ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనలో..  రెవెన్యూ శాఖ బలోపేతం కోసం కృషి చేస్తున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్  ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులు.

Latest Updates