నిరాశలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు

ఆర్టీసీ సమ్మెకాలంలో చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇస్తోంది యాజమాన్యం.  కార్మికుల పిల్లల విద్యార్హతలు, సర్టిఫికెట్స్ పరిశీలించి…కొలువుల్లో చేర్చుకుంటోంది.  రాష్ట్రంలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తో పాటు అనేక ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి.  అయితే విద్యార్హతలకు తగినట్టుగా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు చాలామంది.

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కాలంలో అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.  డ్రైవర్, కండక్టర్ తో పాటు టెక్నికల్ స్టాఫ్ కి చెందిన కొందరు ప్రాణాలు కోల్పోయారు.  సమ్మెకాలంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.  వారి వారసులకు అర్హతను బట్టి కొలువులు ఇస్తామన్నారు.

వరంగల్‍రీజియన్‍పరిధిలో నలుగురు కార్మికులు చనిపోయారు. హన్మకొండ డిపోలో కండక్టర్‍ గా పనిచేస్తున్న  ఏరుకొండ రవీందర్‍, మహబూబాబాద్‍డిపోలో పనిచేసే డ్రైవర్‍ఆవుల నరేష్‍, నర్సంపేట డిపో డ్రైవర్‍యాకుబ్‍పాషాతో పాటు తొర్రూర్‍డిపోలో కండక్టర్‍ ఎం.వీ.పాపయ్య చనిపోయారు.  వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించినట్టు వరంగల్ ఆర్ ఎం శ్రీధర్  తెలిపారు.

డ్రైవర్  ఆవుల నరేష్‍కుమారుడు శ్రీకాంత్‍బీటెక్‍చదివాడు. యాకుబ్‍పాషా కొడుకు ఫయాజ్‍ఎంబీఏ, కండక్టర్‍పాపయ్య కూతురు ఆమని బీటెక్‍, ఏరుకొండ రవీందర్‍కుమారై ప్రవళిక డిగ్రీ పూర్తి చేశారు. ఆర్టీసీలో నాలుగు కేటగిరిల్లో మాత్రమే పోస్టులు ఉన్నాయి. దాంతో వాళ్ళు కోరుకున్న జాబ్స్ మాత్రం దక్కలేదు. విద్యార్హతలకు తగ్గట్టుగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ జాబ్ ఇస్తారని ఆశపడ్డామని… అధికారులు మాత్రం అందుకు ఒప్పుకోలేదన్నారు ఏరుకొండ రవీందర్ కుమార్తె ప్రవళిక. అందుకే తాను సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నానని కన్నీళ్లు పెట్టుకుంది.

ఇన్నాళ్ళూ తండ్రి జాబ్‍మీదే ఆధారపడి బతికామని తొర్రూరు డిపోలో పనిచేస్తూ చనిపోయిన కండక్టర్ పాపయ్య కుమార్తె ఆమని తెలిపింది.  ఇంట్లో అందరూ ఆడపిల్లలేననీ… జాబ్‍ లేకుంటే కుటుంబం గడిచే పరిస్థితి లేదన్నారు. తమ  క్వాలిఫికేషన్‍బట్టి జాబ్‍ఇస్తే బాగుండేదేనీ.. సరైన ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్లుగా తన తండ్రి  సేవ చేసిన సంస్థలోనే తానూ పనిచేయాల్సి వచ్చిందని చనిపోయిన యాకూబ్ పాషా కొడుకు ఫయాజ్ తెలిపారు. ఎంబిఏ చేసిన తాను కండక్టర్ పోస్ట్ ఎంపిక చేసుకున్నట్టు తెలిపాడు.

అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డ్రైవర్ గా పనిచేస్తున్న షేక్ ఖాజమియా గుండె పోటుతో చనిపోయారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతోంది. దాంతో మృతుడు ఖాజమియా కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చారు. నియామక పత్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అందించారు.

కండక్టర్ గా పని చేస్తున్న నీరజ ఉద్యోగం కోల్పోతానన్న మనస్థాపంతో ఉరి వేసుకొని చనిపోయింది. ఇద్దరు చిన్నారులు, భర్త అనేక ఇబ్బందులు పడుతుండటంతో నీరజ భర్త రాజశేఖర్ కు జూనియర్ అసిస్టెంట్ గా అవకాశం కల్పించారు.

ఎంబీఏ, బీటెక్‍చేసిన బాధిత కుటుంబ సభ్యులకు విద్యార్హతకు సంబంధంలేని ఉద్యోగాలు ఇచ్చినా…..ఫ్యామిలీ మెంబర్స్ ని పోషించుకోడానికి ఆర్టీసీలో చేరామని చెబుతున్నారు.

Latest Updates