
‘తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్య’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని నలుదిశలా చాటిన సాహితీయోధుడని పొగిడారు. సోమవారం ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. పద్యమే పదునైన ఆయుధంగా చైతన్య స్ఫూర్తిని రగిలించిన దాశరథి కడవరకూ తెలంగాణ ఊపిరిగా బతికారని మాజీ ఎంపీ కవిత అన్నారు. ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.
గిఫ్ట్ ఎ స్మైల్ చాలెంజ్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా యాడ్స్, బొకేలు, వేడుకల పేరుతో డబ్బు వృథా చేయకుండా ఆ మొత్తాన్ని అవసరంలో ఉన్నవారికి అందజేసేందుకు ఆయన సన్నిహితులు ఓ క్యాంపెయిన్ ప్రారంభించారు. బుధవారం కేటీఆర్ జన్మదినం కావడంతో ట్విట్టర్ వేదికగా ‘గిఫ్ట్ ఎ స్మైల్ చాలెంజ్’ హ్యాష్ ట్యాగ్‌ను సోమవారం ప్రారంభించారు. ఇది మొదలైన కొన్ని గంటల్లోనే భారీగా స్పందన లభించింది. ఎమ్మెల్సీ కూర్మగారి నవీన్‌కుమార్.. అంబులెన్స్‌లు కొనేందుకు శివానంద రిహాబిలిటేషన్ హోమ్‌కు రూ.10,00,116 చెక్కు అందజేశారు. శశి కనపర్తి అనే ఎన్ఆర్ఐ నిశాంత్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు 500 డాలర్లు, శిరీశ్రావు అనే మరో ఎన్ఆర్ఐ 250 డాలర్లను అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి అందజేశారు.