
ఢిల్లీ: వచ్చే గణతంత్ర దినోత్సవ వేడుకలకు-2020 తెలంగాణ శకటం ఎంపికైంది. జనవరి 26న రాజ్ పథ్ పై మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రూపకాన్ని ప్రదర్శించనున్నారు కళాకారులు. వేయి స్థంభాల గుడితో పాటు మన సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ కూడా శకటంపై కొలువుదీరనుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక గణతంత్ర దినోత్సవాలకు మన శకటం ఎంపిక కావడం ఇది రెండోసారి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో తొలిసారి అవకాశం లభించింది. ఆ తర్వాత ప్రతీ ఏటా వివిధ ఆకృతుల నమూనాలు పంపిస్తున్నా.. అవి కమిటీ దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇప్పుడు మేడారం జాతర, బతుకమ్మ, వేయి స్థంభాల గుడి ఆకృతిలో రూపొందించిన శకటం ఎంపికైంది.


