
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ సర్పంచుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 22 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ ను హైదరాబాద్ నారాయణగూడలోని ఆయన నివాసంలో కలిశారు సంఘం నేతలు. సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణిల్ చందర్, సంఘం మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీకి, గ్రామీణ ప్రాంత ప్రజలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. సమ్మెతో గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారని, సీఎం కేసీఆర్…. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆదర్శంగా తీసుకొని… రాష్ట్రంలోని సర్పంచులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
అధికార పార్టీ ఎంపీ , ఎమ్మెల్యేలకు భయపడకుండా సర్పంచుల హక్కుల కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత రైతుల నామినేషన్ల వల్ల ఒడిపోయిందన్న బాధలో… హుజూర్ నగర్ లో సర్పంచుల నామినేషన్ లకు భయపడ్డారని అన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో సర్పంచుల సత్తా చాటుతామన్నారు. అక్కడి ప్రజలు టీఆర్ఎష్ అభ్యర్థిని ఓడించి… ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని కోరారు.