సర్పంచ్​ల పోరు పెరిగిన జోరు

  • త్వరలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, ఢిల్లీలో  ధర్నా
  • గవర్నర్​ను కలిసి సమస్యలు చెప్పుకోనున్న సర్పంచ్​లు
  • ఆర్టీసీ కార్మికుల్ని ఆదర్శంగా తీసుకుని పోరాడుతామన్న సర్పంచ్​ల సంఘం

హైదరాబాద్ , వెలుగు: గ్రామపంచాయితీలకు నిధుల లేమి, జాయింట్​ చెక్​ పవర్​ రద్దు తదితర సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్​ల సంఘం ఉద్యమాన్ని ఉధృతం చేయనుంది. కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ పథకం నిధుల్ని కూడా రాష్ట్ర సర్కార్​ పెండింగ్​లో ఉంచడాన్ని నిరసిస్తూ, రాజ్యాంగం ద్వారా పంచాయితీలకు దక్కే 29 అధికారాల్ని వెంటనే కల్పించాలని డిమాండ్​ చేస్తూ, వాటిని సాధించడం కోసం  సర్పంచ్​ల సంఘం కార్యాచరణకు రెడీ అవుతోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను, పార్లమెంట్​ శీతాకాల సమావేశాల టైమ్​లో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించాలని భావిస్తోంది.

త్వరలో గవర్నర్​కు ఫిర్యాదు

సర్పంచ్​ల సమస్యలు, డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో గవర్నర్​ తలుపుతట్టాలని సంఘం నేతలు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా గవర్నర్​ తమిళిసైని కలిసి  సమస్యల పరిష్కారానికి చొరచూపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని సంఘం నేతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు, క్యాబ్​ డ్రైవర్లు, ప్రజాసంఘాలు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవాళ్లు ఇటీవల గవర్నర్​ను కలిసి వినతి పత్రాలు ఇస్తుండటం, ఆమె జోక్యంతో క్యాబ్ డ్రైవర్లు సమ్మె విరమించుకోవడం తెలిసిందే. గవర్నర్​ను కలిస్తేనన్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వస్తుందేమోనని సంఘం నేతలు భావిస్తున్నారు. సర్పంచ్​లు చేస్తోన్న పోరాటానికి ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

ఆర్టీసీ ఉద్యమమే ఆదర్శంగా

రాష్ట్ర సర్కారు ఎన్ని బెదిరిం పులకు దిగినా వేలాది మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెపై వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు. వాళ్లను ఆదర్శంగా తీసుకుని పోరాటాన్ని ఉదృతం చేయాలని సర్పంచ్ ల సంఘం నిర్ణయించుకుం ది. మా సమస్యలపై అతిత్వరలోనే గవర్నర్ ను కలుస్తాం. తద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుం ది. విషయం కేంద్రం దృష్టికి వెళుతుం ది. పంచాయితీలకు అధికారాల కోసం జమ్మూకాశ్మీర్ సర్పంచ్ లు చేపట్టినట్లే ఢిల్లీలోని పార్లమెంట్ ముందు పరేడ్ నిర్వహిస్తాం. రాష్ట్ర సర్కారు తీరుకు నిరసనగా జంతర్ మంతర్ లో ధర్నా చేస్తాం ‑ ప్రణీల్ చందర్ , సర్పం చ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి

Telangana Sarpanch's Association ready to conduct state wide protests for their demands

Latest Updates