రేపట్నుంచి బడి బాట : స్టడీ క్యాలెండర్ ఇదే..

telangana-schools-reopen

వేసవి సెలవులు ముగిశాయి. బుధవారం నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. జూన్ ఫస్ట్ నుంచే స్కూల్స్ ప్రారంభం కానున్నట్లు మొదట అనౌన్స్ చేయగా..ఎండలు ఎక్కువగా ఉండటంతో జూన్-12కి పొడిగించారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ తెరచుకోనున్నాయి. ఈ క్రమంలోనే విద్యా సంవత్సర క్యాలెండర్ ను ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం 232 పని దినాలు
ఏప్రిల్ 23 చివరి పనిదినం
పదో తరగతి విద్యార్థులకు జనవరి 10 నాటికి సిలబస్‌ పూర్తి
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 29 నాటికి సిలబస్‌ స్టడీ పూర్తి
అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 26 వరకు ఎస్‌ఏ 1 పరీక్షలు
ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఎస్‌ఏ 2 పరీక్షలు
ఫిబ్రవరి 29 నాటికి పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు పూర్తి
సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 13 వరకు మొత్తం 16 రోజులు దసరా సెలవులు
మిషనరీ పాఠశాలలకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు ఏడు రోజులు క్రిస్మస్‌ సెలవులు
జనవరి 11 నుంచి 16 వరకు 6 రోజులు సంక్రాంతి సెలవులు
ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు

Latest Updates