అక్కను అనుమానించాడని బావ గొంతు కోశాడు

  • చివ్వెంల పోలీస్​ స్టేషన్లో ఘటన
  • విషమంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితి

సూర్యాపేట క్రైం, వెలుగు: అక్కను అనుమానించి, తరచూ చేయి చేసుకుంటున్న బావ గొంతుకోశాడో బామ్మర్ది.. రక్తమోడుతున్న బాధితుడిని బంధువులు లోకల్ ​ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి సీరియస్​గా ఉందని చెప్పి డాక్టర్లు హైదరాబాద్​కు పంపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల్ల పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చివ్వెంల మండల పరిధిలోని జగన్నాయక్ తండాకు చెందిన రమావత్ దేవేందర్, శ్వేత భార్యాభర్తలు.. లారీ డ్రైవర్​గా పనిచేస్తున్న దేవేందర్ ​కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నయి. భర్తపై శ్వేత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బయటికొచ్చాక మళ్లీ సర్దిచెప్పి ఇంటికి తీసుకెళ్లి కొట్టేవాడని శ్వేత తెలిపింది. ఈ క్రమంలో ఆదివారం మరోసారి స్టేషన్లో కంప్లైంట్ చేయగా.. సోమవారం ఇరువర్గాల పెద్దలు స్టేషన్​ ఆవరణలో మాట్లాడుతున్నరు. పెద్దలు సర్దిచెప్పడంతో భార్య శ్వేతకు క్షమాపణ చెప్పడానికి దేవేందర్​ అంగీకరించాడు. భార్య దగ్గరికి వెళ్లి క్షమాపణ చెబుతుండగా పక్కనే ఉన్న శ్వేత తమ్ముడు రఘు ఒక్కసారిగా బావపై దాడి చేశాడు. అక్కను అవమానించాడనే కోపంతో బ్లేడ్​తో గొంతుకోశాడు. గాయపడిన దేవేందర్​ను బంధువులు సూర్యాపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.

Latest Updates