ఝార్ఖండ్ లో అన్నం కోసం అల‌మ‌టిస్తున్న తెలంగాణ బుడ్గ జంగాలు

లాక్ డౌన్ క్ర‌మంలో ఇప్ప‌టికే పొట్ట చేత ప‌ట్టుకుని వ‌ల‌స కూలీలు కాలి న‌డ‌క‌న స్వ‌స్థాలాల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఝార్ఖండ్ రాష్ట్రంలో మ‌న తెలంగాణ వాసులు చిక్కుకు పోయారు. వ‌స‌తి, భోజ‌నంలేక ఆక‌లితో అల‌మ‌టిస్తున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర బుడ్గ జంగాలు తెలిపారు. త‌మ‌ని ఆదుకోవాల‌ని వీడియో ద్వారా తెలిపారు కరీంనగర్ జిల్లా.. బెజ్జంకి, గన్నేవరం గ్రామానికి చెందిన బేడ(బుడ్గ)జంగాలు.

వీళ్లు బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని సుమారు 200 ల మంది ఝార్ఖండ్ రాష్ట్రం లోని కోడూరిమా..అజారి బాగ్..గిరెడ్డి..ధన్ బాగ్ జిల్లాలల్లో కరోనా వైరస్ లాక్ డౌన్ లో చిక్కుకు పోయి ఉన్నారు. వారిని అక్కడి గ్రామాల్లో ఉండనివ్వక గుట్టల్లో.. చెట్లల్లో ఉండాలని గ్రామస్తులు, పోలీసులు తరిమికొట్టార‌ని వీడియోలో తెలిపారు. గుట్టలపైన‌..చెట్లకింద‌ ఉంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న‌ట్లు చెప్పారు. క‌నీసం తాగ‌డానికి నీళ్లు.. తిన‌డానికి అన్నం గాని దొరుకకా పిల్లా పాపాలతో, మహిళలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం తాము అజారి బాగ్ జిల్లా, భరీ బర్ కట్ట గ్రామంలో ఉన్నామ‌ని చెప్పారు.

ద‌య‌చేసి సీఎం కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్, ర‌స‌మ‌యి బాల‌కృష్ణ‌, ఎంపీ బండి సంజ‌య్ సార్లు త‌మ‌ని ఆదుకోవాల‌ని తెలిపారు. వారి గ్రామ సర్పంచ్ పుల్లల లక్ష్మీ.. లక్ష్మయ్య సార్లు ఏదో ఉపాయం చేసి మా భార్యా పిల్లలను..మమ్ములను ఈ అరణ్యం నుండి మా ఊరికి..తమ గ్రామాలకు తీసుకుపోవాలని వేడుకుంటున్నారు.

మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బయటి రాష్ట్రాలకు చెందిన వ్వక్తులను తమ బిడ్డలుగా హక్కును చేర్చుకొని వారికి ప్రతి ఒక్కరికి బియ్యం..పిండి..ఉప్పు..పప్పుల తోపాటు 500ల రూపాయలు..ఇస్తూ వారిని రక్షించుకుంటున్నాం.కనుక ఇతర రాష్ట్రలల్లో ఉన్న మన తెలంగాణ బిడ్డలను కూడా అక్కడి ప్రభుత్వాలు అన్న పానీయాలు..వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతున్నామని వీడియో ద్వారా తెలిపారు.

Latest Updates