
- తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
కొత్తపల్లి, వెలుగు: విద్యార్థులు కష్టపడి విజయం సాధించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సూచించారు. బుధవారం కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ హైస్కూల్లో సీబీఎస్ఈ క్లస్టర్ సెవెన్ బాలికల టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. తల్లిదండ్రుల ఆశయాలను, విద్యార్థుల తమ లక్ష్యాలను సాధించడానికి పోటీపడాలని సూచించారు.
టోర్నమెంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 35 స్కూల్ నుంచి సుమారు 2,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ పి.వెంకటరమణ, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి, డీవైఎస్వో శ్రీనివాస్, అబ్జర్వర్పద్మారావు, మహిపాల్ పాల్గొన్నారు.