OMRషీట్ లో తప్పులు చేస్తే కొత్త చట్టాలతో శిక్షిస్తాం : విద్యాశాఖ

ఇంటర్ పరీక్ష పత్రాల వాల్యుయేషన్ లో తప్పులపై విద్యాశాఖ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వ్యవహారంపై సీఎస్ ఎస్కే జోషితో చర్చించానని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని… పరీక్ష పోతే మళ్లీ రాసుకోవచ్చు.. లేదా మరో కోర్సు చదువుకోవచ్చు కానీ.. ప్రాణం పోతే తిరిగిరాదని అన్నారు. విద్యార్థులు అధైర్యపడొద్దని చెప్పారు.

ఇంటర్మీడియట్ ఫలితాలపై ఆందోళనలు, నిరసనలకు ఎవరూ ముందుకురావొద్దని ఆయన కోరారు. నిన్నటివరకు 9వేల అప్లికేషన్లు వచ్చాయని చెప్పిన జనార్ధన్ రెడ్డి.. 25 తేదీ వరకు ఇంకా సమయం ఉందని అన్నారు. సందేహాలున్న వారు ఎవరైనా … రీ వెరిఫికేషన్ కు రూ.6వందలు… రీ కౌంటింగ్ కు రూ.100 కట్టి అప్లైచేసుకోవచ్చని.. అవసరమైతే తేదీ పొడగింపుపై ఆలోచిస్తామని చెప్పారు.

సాఫ్ట్ వేర్ పై వస్తున్న వార్తలపై కమిటీ విచారణ కొనసాగుతోందని.. కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు జనార్ధన్ రెడ్డి. OMR షీట్ లో తప్పులు చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఉన్న చట్టాల కంటే కొత్త చట్టాల ద్వారా వారిని శిక్షిస్తామనీ.. వారికి ఫైన్ కూడా పెంచుతామని చెప్పారు. పేపర్లు దిద్దడంలోనే తప్పులు జరిగిఉంటే.. విద్యార్థులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక్క స్వశక్తి సంఘం ఏర్పాటు చేస్తామన్నారు జనార్ధన్ రెడ్డి. దీని ద్వారా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఒకరికొకరు చెప్పుకోవచ్చన్నారు.

Latest Updates