కిక్ బాక్సింగ్ లో తెలంగాణ రాష్ట్రానికి మూడవ స్థానం

రష్యాలో జరిగిన వాకో వరల్డ్ కప్ డైమండ్ కిక్ బాక్సింగ్ 2019 (WAKO World Cup Diamond Kickboxing 2019)కాంపిటేషన్ లో తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మూడవ స్థానం దక్కింది.  గత నెల 24 నుంచి 29 వరకు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు క్రీడాకారులు అత్యత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు.

  • ఈ కాంపిటీషన్ లో మంచిర్యాల జిల్లాకు చెందిన ఆనే సుశృత మూడు విభాగాల్లో 1 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్  & 1 బ్రాన్స్ మెడల్ (కిక్ లైట్ -49 కేజీ., మ్యూజికల్ ఫామ్స్ – సాఫ్ట్ స్టైల్ & సాఫ్ట్ స్టైల్  వెపన్స్) ను సాధించింది.
  • వరంగల్ జిల్లాకు చెందిన మార్క సంతోషి మూడు కాంస్య పతకాలను (పాయింట్ ఫైట్ -50 కేజీ., మ్యూజికల్ ఫామ్స్ – సాఫ్ట్ స్టైల్ & సాఫ్ట్ స్టైల్  వెపన్స్) సాధించింది.
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన సంజీవ్ రాసకొండ రెండు బ్రాన్స్ మెడల్స్ (మ్యూజికల్ ఫామ్స్ – సాఫ్ట్ స్టైల్ & హార్డ్ స్టైల్) ను సాధించారు.

ముగ్గురు బాక్సర్లు మంగళవారం రాత్రి 11 గంటలకు రష్యా నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కుటుంబసభ్యులు, కోచ్ లు, టీచర్లు వారికి ఘనస్వాగతం పలికారు

ఈ సందర్భంగా బాక్సర్లు మాట్లాడుతూ.. తమకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సహం లభించలేదని, లభించక పోగా సర్టిఫికెట్స్ చూసి తమను అవహేళన చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను అవమానించిన పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం మరియు భారతదేశం ఖ్యాతి నిలబెట్టాలనే లక్ష్యం తో రష్యా వెళ్లి పథకాలు సాధించుకొని వచ్చామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాక్సింగ్ ను గుర్తించి ఒలింపిక్స్ లో చేరిస్తే బంగారు పథకాలు తీసుకోస్తామని వారు అన్నారు. తాము ఆర్థికంగా వెనుకబడిన వారిమి కాబట్టి ప్రభుత్వం అందుకు సహాయం అందించాలని కోరారు.

 

Latest Updates