వ్యవసాయానికి ప్రాధాన్యం.. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఇవీ

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2019-20 ఏడాదికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దేశంలో ఉన్న ఆర్థిక మాంద్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపుల అంచనాలను తక్కువగా చేసినట్టు సీఎం చెప్పారు. పరిస్థితుల్లో మార్పులు వస్తే బడ్జెట్ లో కేటాయింపుల అంచనాలు మార్చుకునే వెసులుబాటు ఉందని చెప్పారు.

ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయం, రైతుల విషయంలో కేటాయింపులు భారీగానే చేశామని చెప్పారు సీఎం కేసీఆర్. ఇది వ్యవసాయం, రైతుపట్ల తమ చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతోందని అన్నారు.

బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.

రైతు బంధుకు రూ.12 వేల కోట్లు

రైతూ బీమాకు రూ.1137కోట్లు

పంట రుణాల మాఫీకి రూ.6వేల కోట్లు

విద్యుత్ సబ్సిడీల కోసం రూ.8వేల కోట్లు

వ్యవసాయ ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు సీఎం. రైతులపై వేయకుండా తామే చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందనీ… చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా.. సంక్షేమ పథకాలకు నిధుల కొరత రానీయం అని చెప్పారు సీఎం.

ఆసరా పెన్షన్లకు బడ్జెట్ లో కేటాయింపులు రూ.9,402 కోట్లు

ప్రతి నెల గ్రామ పంచాయతీలకు : రూ.339 కోట్లు

Latest Updates