ధాన్యం సేకరణలో తెలంగాణ నెంబర్ వన్

ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. రికార్డ్ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించిందని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలకు అందనంతగా భారీ మొత్తంలో ధాన్యాన్ని సేకరించిందని తెలిపారు. ఈ సీజన్‌లో దేశ వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరిస్తే అందులో తెలంగాణ రాష్ట్రంలోనే 34.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని మంత్రి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.. ‘గౌరవ కేంద్రం మంత్రి పాశ్వాన్ వెల్లడించిన ప్రకారం యాసంగి సీజన్లో వరి సేకరణలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ రైతులు, ప్రజలకు ఇది గర్వకారణం. ఆరు ఏళ్లలోపే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతలా మారిపోయింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Latest Updates