గవర్నర్ నరసింహన్ ను కలిసిన రాష్ట్ర నేతలు…

గవర్నర్ ESL నరసింహన్ ను రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్ర నేతలు, అధికారులు. కలిసిన వారిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించబడిన దత్తాత్రేయ, సీఎస్ ఎస్.కె.జోషి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఉన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంతో పాటు, రాష్ట్రం వచ్చాక కూడా సేవ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా పదేళ్లుగా రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని నేతలతో పంచుకున్నారు నరసింహన్.

ఈరోజు పొద్దున సతీసమేతంగా ఖైరతాబాద్ వినాయకున్ని దర్శించుకున్నారు నరసింహన్. ఆ తర్వాత అధికారపక్షానికి చెందిన పలువురు నేతలు నరసింహన్ ను కలిసి వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. మరి కొన్ని రోజుల్లో రాష్ట్రానికి గవర్నర్ గా తమిళఇసై రానున్నారు.

Latest Updates