వెంకట్రామయ్య మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటు

వెంకట్రామయ్య మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటు

సుధీర్ఘ కాలం ఆల్ ఇండియా రేడియో లో వ్యాఖ్యాత గా పని చేసిన సుప్రసిద్ధ రచయిత, సీనియర్ పాత్రికేయులు డీ.వెంకట్రామయ్య మృతి కి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వెంకట్రామయ్య తన గంభీరమైన గొంతు తో రేడియో వ్యాఖ్యాతగా సుప్రసిద్ధులు అని అన్నారు .రచయితగానే కాకుండా జర్నలిస్టులందరికి పెద్ద దిక్కు గా ఉండేవారని‌,ఆయన మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటని తెలిపారు.

” వేంకట్రామయ్య గారికి పుస్తకాలన్నా, సినిమాలన్నా ప్రాణం. సోమవారం ఉదయం మనువడ్ని తీసుకుని వరసగా రెండు సినిమాలు.. సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠ పురములో చూడాలని కూకట్ పల్లి పీవీఆర్ ఫోరం మాల్ కి వెళ్ళారు. ఒక ఆట చూసి రెండో సినిమాకు వెడుతూ మధ్యలో కుప్పకూలిపోయారు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్ళినా.. ఫలితం లేకపోయింది.
హాయిగా సినిమాకని వెళ్ళిన మనిషి విగతజీవుడిగా ఇంటికి రావడంతో వారి కుటుంబ సభ్యుల విషాదానికి అంతే లేదు. ఈ విషాద సమయంలో నేను హైదరాబాద్ లో లేను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని నారాయణ తెలిపారు.