కరోనా టెస్టింగ్ లో తెలంగాణ పూర్

పీసీఆర్ టెస్టులు తగ్గించిన్రు..యాంటీజెన్ టెస్టులు పెంచిన్రు

పాజిటివ్ కేసులు భారీగా మిస్ అయినయ్

3.2 లక్షల కేసులు రిపోర్ట్ కాలే

వాస్తవంగా 5.8 లక్షల కేసులుండొచ్చని అంచనా

‘ఎన్డీటీవీ’ కథనంలో వెల్లడి

న్యూఢిల్లీ:  కరోనా టెస్టుల విషయంలో మన రాష్ట్రం పనితీరు దేశంలోనే చాలా పూర్ గా ఉంది. టెస్టుల విషయంలో దేశంలోని 5 వరస్ట్ స్టేట్స్ లో తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. సర్కార్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.6 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే అసలు కేసుల సంఖ్య 5.8 లక్షల వరకు ఉండొచ్చని, రాష్ట్రంలో ఏకంగా 3.2 లక్షల కేసులు రిపోర్ట్ కాకుండా ఉండొచ్చని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చేసిన పీసీఆర్, యాంటీజెన్ టెస్టుల సంఖ్య ఆధారంగా సంబంధిత ప్రభుత్వాలు చెప్పిన కేసులెన్ని? రిపోర్ట్ కాని కేసులెన్ని? వాస్తవంగా అసలు కేసులెన్ని ఉండొచ్చు? అన్నవి ‘ఎన్డీటీవీ’ అంచనా వేసింది. ఏయే రాష్ట్రాల్లో టెస్టులు ఎలా చేశారు? టెస్టుల విషయంలో ఏ రాష్ట్రాలు బెస్ట్? ఏవి వరస్ట్? అన్నది లెక్కలతో సహా వివరించింది.

టెస్టుల్లోనే అసలు కిటుకు

కేసుల్ని తక్కువ చేసి చూపాలంటే.. రెండు మార్గాలున్నయి. ఒకటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నట్లు టెస్టుల్ని తక్కువగా చేయడం. లేదా పీసీఆర్ టెస్టులను తగ్గించి, యాంటీజెన్ టెస్టుల్ని భారీగా పెంచడం. కరోనా సోకిందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు లేదా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే యాంటీజెన్ టెస్టుల కంటే పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 2.5 – 3.5 రెట్లు ఎక్కువగా వచ్చే చాన్స్ ఉండటం అసలు ముచ్చట. అంటే.. వంద యాంటీజెన్, పీసీఆర్ టెస్టులు చేస్తే.. పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ కేసులు 3.5 రెట్లు ఎక్కువగా వస్తాయి. తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు పీసీఆర్ టెస్టులు తగ్గించి.. యాంటీజెన్ టెస్టుల సంఖ్యను విపరీతంగా పెంచేశాయి. యాంటీజెన్ టెస్టులతో ఆటోమేటిక్ గా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. టెస్టులతో మాయాజాలం చేసి లక్షల కేసులను దాచిపెట్టాయని చెప్తున్నారు.

పూర్ టెస్టింగ్

మొత్తం టెస్టుల్లో పీసీఆర్ టెస్టుల శాతంలో బీహార్, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ, యూపీ రాష్ట్రాలు.. దేశంలోనే టాప్ 5 వరస్ట్ స్టేట్స్ గా నిలిచాయి. ఈ రాష్ట్రాల్లో 50% కంటే తక్కువ పీసీఆర్ టెస్టులు చేశారు. బీహార్ లో 15 శాతమే చేయగా, తెలంగాణలో 17% పీసీఆర్ టెస్టులే చేశారు. అయితే పీసీఆర్ టెస్టుల విషయంలో తమిళనాడు దేశంలోనే బెస్ట్ స్టేట్ గా నిలిచింది. ఈ రాష్ట్రంలో 100% పీసీఆర్ టెస్టులు చేశారు. రాజస్థాన్ లో కూడా 100% చేశారు. ఇక ఏపీలో 59% పీసీఆర్ టెస్టులు చేయగా, ఆ రాష్ట్రం 9వ ప్లేస్ లో నిలిచింది.

అండర్ రిపోర్టెడ్ కేసులు ఇట్లా..

యాంటీజెన్ టెస్టులు అత్యధికంగా చేసిన రాష్ట్రాలు పాజిటివ్ కేసుల్ని కూడా పెద్ద ఎత్తున మిస్ అయ్యే చాన్స్ ఉంటుంది. దీని ప్రకారం చూస్తే బీహార్, తెలంగాణ వరస్ట్ స్టేట్స్ లో ఫస్ట్, సెకండ్ ప్లేస్ లలో ఉన్నాయి. బీహార్ లో ప్రభుత్వం చూపిన కేసుల కంటే.. వాస్తవ కేసులు132% ఎక్కువగా ఉండొచ్చని, తెలంగాణలో 123% కేసులు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. అండర్ రిపోర్టెడ్ కేసుల విషయంలోనూ తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు 0% కేసులతో బెస్ట్ స్టేట్స్ గా నిలిచాయి. ఇక
ఏపీ 37% అండర్ రిపోర్టెడ్ కేసులతో 9వ ప్లేస్ లో నిలిచింది.

రిపోర్ట్ కాని కేసులు

రిపోర్ట్ కాని కేసులను శాతాల్లో కాకుండా అంకెల్లో చూస్తే.. అసలు లెక్కలు అర్థమవుతాయి. రిపోర్ట్ కాని కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత తెలంగాణ థర్డ్ ప్లేస్ లో ఉంది. మహారాష్ట్రలో 6.4 లక్షలు, ఢిల్లీలో 4.3 లక్షల కేసులు రిపోర్ట్ కాలేదని అంచనా. తెలంగాణలో దాదాపు 3.2 లక్షల కేసులు రిపోర్ట్ కాలేదని, సర్కార్ లెక్కల ప్రకారం 2.6 లక్షల కేసులు నమోదు కాగా, వాస్తవ కేసులు 5.8 లక్షల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ విషయంలోనూ రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్ బెస్ట్ స్టేట్స్ గా నిలిచాయి.

దేశంలో 34 లక్షల కేసులు రిపోర్ట్ కాలే

దేశంలో మొదట్లో 100% పీసీఆర్ టెస్టులు చేశారు. ఇప్పుడు పీసీఆర్ టెస్టులు 60 శాతానికి తగ్గాయి. దేశంలో మొత్తం13.36  కోట్ల టెస్టులు జరిగాయి. ఇప్పటివరకు 5.5 కోట్ల యాంటీజెన్ టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల్లో 40% ఇవే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే 34 లక్షల పాజిటివ్ కేసులు మిస్ అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

టెస్టింగ్ పక్కాగా చేసిన రాష్ట్రాలు..

ఒక రాష్ట్రంలో టెస్టులు పక్కాగా చేశారా? లేదా? అన్నది అంచనా వేయాలంటే.. ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత? ఎన్ని పీసీఆర్ టెస్టులు చేశారు? అన్నవి చూడాల్సి ఉంటుంది. దీని ప్రకారం తమిళనాడు బెస్ట్ గా ఉంది. కర్నాటక, ఏపీ సెకండ్, థర్డ్ ప్లేస్ ల్లో నిలిచాయి. పీసీఆర్ టెస్టులు తక్కువగా చేసిన రాష్ట్రాల్లో బీహార్, తెలంగాణ, గుజరాత్ తొలి మూడు ప్లేస్‌‌ల్లో ఉన్నాయి. బీహార్‌‌‌‌లో ప్రతి 10 వేల మందికి 148 పీసీఆర్ టెస్టులు, తెలంగాణలో 185, గుజరాత్‌‌లో 215 టెస్టులు మాత్రమే చేశారు.

పాజిటివిటీ రేట్ తక్కువగా చూపిన రాష్ట్రాలు

బీహార్ లో అఫీషియల్ గా ప్రకటించిన పాజిటివిటీ రేట్ కన్నా.. 232% ఎక్కువగా ఉండొచ్చని, తెలంగాణలో 223% ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఏపీలో 137% ఎక్కువుండొచ్చని తెలుస్తోంది. ఇక తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో 100%, పంజాబ్ లో 103% ఎక్కువుండొచ్చని అంచనా. దేశంలో పాజిటివిటీ రేట్ 6.9% ఉన్నట్లు అఫీషియల్ గా ప్రకటించగా, వాస్తవ పాజిటివిటీ రేట్ 9.6% (అంటే 140% ఎక్కువ) ఉంటుందని అంచనా .

Read More News….

ఆ రైలు పరుగుల వెనుక ‘‘పింక్ గ్యాంగ్’’

ఆక్సిజన్ ట్రీట్ మెంట్ తో వయసు​ తగ్గించొచ్చట

వెరైటీ వెడ్డింగ్ కార్డు: మట్టిలో పెడితే పూలు, కూరగాయల మొక్కలు మొలకెత్తుతాయి

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?

Latest Updates