పంచాయతీ రాజ్ లో ‘ఈ-పాలన’ స్టార్ట్

పంచాయతీ రాజ్ లో  ‘ఈ-పాలన’ స్టార్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  పంచాయతీ రాజ్, రూరల్‌‌‌‌‌‌‌‌డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌శాఖల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌పాలన స్టార్టయ్యింది.  ఏళ్లుగా పేపర్ల మీద నడిచిన క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ఇప్పుడు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఈజీగా జరిగిపోతోంది. ఈ నెల 1వ తేదీ నుంచే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఫైళ్లు క్లియర్‌‌‌‌‌‌‌‌చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని ఆఫీసుల్లో పూర్తిస్థాయిలో ఫైళ్లు స్కానింగ్‌‌‌‌‌‌‌‌కాలేదని, అందుకే కొన్ని పేపర్‌‌‌‌‌‌‌‌ఫైళ్లు కూడా వస్తున్నట్టు చెప్పారు. గతంలో నెలకు 700 వరకు పేపర్‌‌‌‌‌‌‌‌ఫైళ్లు వచ్చేవని, ఇప్పుడు అవి 150కి తగ్గాయన్నారు. ఇంకో నెలలో అవి కూడా ఉండే అవకాశం ఉండదని, అన్ని ఈ–ఫైల్సే వస్తాయంటున్నారు. దీని వల్ల స్టేషనరీ, పేపర్ వాడకం తగ్గడంతోపాటు ఫైల్స్, వాటిలో పేపర్స్‌‌‌‌‌‌‌‌మిస్సయ్యే అవకాశం లేదంటున్నారు.

అన్ని ఫైళ్లు స్కానింగ్

డిపార్ట్ మెంట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సుమారు 5 వేల ఫైళ్లను గత రెండు నెలలుగా సిబ్బంది స్కాన్ చేశారు. పీఆర్ ఆర్డీలో కీలక విభాగాలైన ఉపాధి హామీ స్కీమ్, స్త్రీనిధి, ఆసరా పెన్షన్లు, స్వచ్ఛభారత్, ఈజీఎమ్ ఎమ్, కమిషనరేట్లకు చెందిన అన్ని ఫైళ్లను స్కాన్ చేశారు. వీటిలో కోర్టు కేసులు, అధికారుల పదోన్నతలు, క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. ప్రతి ఫైల్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేకంగా నంబర్ కేటాయించి సెంట్రల్ సర్వర్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌చేశారు. దీని వల్ల ఫైళ్లు ఈజీగా దొరుకుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌కు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌

పీఆర్, ఆర్డీ శాఖలోని 30 మంది ఉద్యోగులు, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్‌‌‌‌‌‌‌‌తోపాటు సూపరింటెండెంట్లు, డీపీవో స్థాయి అధికారులకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌పాలనపై నేషనల్ ఇన్ఫర్మాటిక్‌‌‌‌‌‌‌‌సెంటర్, ఐటీ శాఖ సుమారు వారం రోజులపాటు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ఇచ్చింది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌విధానంలో సమస్యలొస్తే ఎలా స్పందించాలన్న దానిపైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

ఫైల్‌‌‌‌‌‌‌‌ఎక్కడ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉందో తెలిసిపోతుంది

గతంలో ఒక ఫైల్ వివిధ సెక్షన్లలో క్లియరై కమిషనర్‌‌‌‌‌‌‌‌, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరకు రావాలంటే నెలలు పట్టేది. వివిధ కారణాలు, అనుమానాలు, సందేహాలు పరిష్కరించడానికి సమయం తీసుకునేవారు. దీంతో ఒక్కో సెక్షన్ దగ్గర కొన్ని రోజులు, నెలలపాటు ఫైల్‌‌‌‌‌‌‌‌ఉండేది. ఈ పాలన అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ఫైల్ ఏ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో  ఉంది, ఎందుకు ఆగింది అనే విషయాలు తెలిసిపోతాయి. ఫైల్‌‌‌‌‌‌‌‌ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌ఎప్పటికప్పుడు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది.