ఏపీ ఎంసెట్​లో తెలంగాణ విద్యార్థుల హవా     

telangana-students-in-ap-eamcet

ఏపీ ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ టెన్ లో ఆరు, అగ్రికల్చర్ లో 3 ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ లో ఏపీకి చెందిన రవిశ్రీతేజ 97.50 శాతంతో ఫస్ట్ ర్యాంక్ సాధించగా, అగ్రికల్చర్ లో సుంకర సాయి స్వామికి ( 97.23శాతం) మొదటి ర్యాంక్ వచ్చింది. ఇంజినీరింగ్ లో  తెలంగాణకు చెందిన పి.వేద ప్రవీణ్  రెండోర్యాంకు, డి. చంద్రశేఖర్  4,  బట్టేపతి కార్తికేయ 5 , అప్పకొండ అభిజిత్ రెడ్డి 8 ,  ఆర్యన్ లద్దా 9 , అల్లంపల్లి హేమ వెంకట అభినవ్ కు పదో ర్యాంకు సాధించారు.  అగ్రికల్చర్ విభాగంలో  తెలంగాణకు చెందిన  తిప్పారాజు హాసిత 4 వ ర్యాంకు, జి. మాధురి రెడ్డి 5 వ ర్యాంకు, ఎంపటి కుశ్వంత్ కు 10 వ ర్యాంకులు వచ్చాయి. మంగళవారం విడుదలైన ఏపీ ఎంసెట్ ఫలితాల్లో  ఇంజినీరింగ్ లో 74.39 శాతం, అగ్రికల్చర్ లో 83.64 శాతం మంది అర్హత సాధించారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు జరిగిన ఎంసెట్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 2,82,901 మంది విద్యార్థులు హాజరయ్యారు.  తెలంగాణ నుంచి 36,698 మంది పరీక్ష రాశారు. ‘ఇంజనీరింగ్ లో 1,88,711 మంది స్టూడెంట్స్ హాజరు కాగా 1,30,160 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 88,916 మంది పరీక్ష రాయగా 68,512 మంది క్వాలిఫై అయ్యారు’ అని అధికారులు చెప్పారు.  ఈ నెల 10 నుంచి ర్యాంక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం కారణంగా ఫలితాలు 15 రోజులు ఆలస్యమైనట్లు వెల్లడించారు.

Latest Updates