CBSE టెన్త్ లో మనోళ్లు టాప్

సీబీఎస్‍ఈ ప్రకటించిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఇద్దరు హైదరాబాద్‍ స్టూడెంట్స్ టాప్ లో నిలిచారు. బీహెచ్‍ఈఎల్‍– ఆర్ సీపురంలోని భారతీయ విద్యా భవన్ లో చదివే విద్యార్థిఅంకిత్‍ సాహ, బంజరాహిల్స్ లోని మెరిడియన్‍ స్కూల్‍ విద్యార్థి ని మద్దేల హర్షిణీ సంయుక్తంగా500 మార్కులకు 497 మార్కు లను కైవసంచేసుకొ ని దేశంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు సీబీఎస్‍ఈ బోర్డు తెలిపింది . రాష్ట్రంలో ఫస్ట్​ప్లేస్ లో నిలిచారు.

ఈ సందర్భంగా అంకిత్‍ మాట్లాడుతూ ఐఐటీలో కంప్యూటర్‍ సైన్స్ చదవడమేతన లక్ష్యమని చెప్పారు. పీవీబీ పబ్లిక్‌ స్కూల్‌ జూబ్లీహిల్స్ కు చెంది న శాంభవి కుల్బె, నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్ కు చెందిన శ్రేయ రెపల-496మార్కులు సాధించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచారు. మహేంద్ర హిల్స్‌ అమృత విద్యాలయానికి చెందిన – జొన్నల గడ్డ అనంతసాయి శర్వాణి495 మార్కులతో ఐదో ర్యాంకు సాధించారు. అత్తాపూర్‌ ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్ లెన్స్ లోచదివిన శుభతనయ -495 మార్కులతో ఆరోర్యాంకు సాధించారు. బాచుపల్లి సిల్వర్‌ ఓక్‌ హైస్కూల్ కు చెందిన గుడెపు రాజేశ్వరి అనన్య -495మార్కులతో ఏడో ర్యాంకు సాధించారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్సెకండ రీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. 2018-–19 అకడమిక్‍ ఇయర్ కు సంబంధించి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 91.1 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు బోర్డు అధికారులు సోమవారం వెల్లడించారు.

గోల్కొండ ఆర్మీ పబ్లిక్‍ స్కూల్ కు చెందిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు స్కూల్‍ ప్రిన్సిపల్ విద్యా మురళీధరన్‍ తెలిపారు. అన్మోల్‍ కురోతి 98.2 శాతం మార్కుల సాధించి టాపర్ గా నిలిచిండన్నారు. మ్యా థ్స్, సోషల్ లో 100శాతం మార్కులు వచ్చాయన్నారు.

షిఫావాలియా97.4శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. నిత్య రవింద్ర కుబేర్‍ 96.6శాతం మార్కు లు, రేణు కుమారి93.4శాతం మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పాఠశాలకు చెందిన 29 మంది విద్యార్థులు90శాతం పైగా మార్కులు పొందినట్లు వెల్లడించారు.

బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ కి చెంది న 231మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ప్రిన్సిపల్ స్మీతా గొవింద్‍ తెలిపారు. ఇందులో20 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా,78 మంది స్టూడెంట్స్ 90శాతం మార్కు లు పొందినట్లు వెల్లడించారు. అర్జున్‍ ధార్వాల్‍ 96.6 శాతం మార్కులతో టాపర్ గా, మహెక్ గుప్తా 96.4శాతం మార్కులతో రెండోస్థానంలో నిలిచారన్నారు.

ఆర్ కే పురం ఆర్మీ పబ్లిక్‍ స్కూల్‍ విద్యార్థిశ్రేయా స్వాతి 98.6శాతం మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సి పల్ ఎం-.ఉషారాణి తెలిపారు. సిద్దార్థ్ రాజ్‍ 98.2శాతం మార్కులతో రెండో స్థానం, నబనీతపాటి 97.8 శాతం మార్కులతో మూడోస్థానం పొందినట్టు చెప్పారు.

Latest Updates