ఆర్టీసీ సడక్ బంద్ కు టీటీడీపీ మద్దతు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 18న క్షేత్ర స్ధాయిలో పర్యటించాలని జిల్లా నేతలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆదేశించారు. రైతు సమస్యలపై ఈ నెల 20న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. శనివారం టీడీపీ రాష్ట్ర నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు 4 గంటల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిస్ధితులపై నేతలతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాలకు అద్యక్షులను నియమించారు. ఇటీవల మరణించిన ఆర్టీసీ కార్మికుడు సురేందర్ గౌడ్ కుటుంబానికి పార్టీ తరుపున రూ.1లక్ష చెక్కును అందజేశారు. ఈ నెల 19న జరగనున్న ఆర్టీసీ జేఏసీ సడక్ బంద్ కు టీడీపీ మద్దతిస్తున్నట్లు ఎల్.రమణ తెలిపారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ , శ్రీపతి సతీష్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

 

Latest Updates