కరీంనగర్ రూట్ లో టూరిజం బస్సు.. అందరికీ రూ.500 టిక్కెట్టే

కరీంనగర్ క్రైం, వెలుగు: ఎక్కువ చార్జీలు వసూలు చేయడంపై ఓ ప్రయాణికుడు ఆర్టీఓకు ఫిర్యాదు చేశారు. సమ్మె నేపథ్యంలో తెలంగాణ టూరిజం బస్సును రవాణాకు వాడుతున్నారు.

శనివారం హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు బయలుదేరిన బస్సులో 23 మంది నుంచి చిన్నాపెద్ద తేడా లేకుండా రూ. 500 చొప్పున వసూలు చేశారు. కరీంనగర్ కు చెందిన శ్రీధర్ రెడ్డి దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు.

వారు వచ్చేసరికే బస్టాండ్ వద్ద ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. డ్రైవర్లు రాజయ్య, మహ్మద్‌ను విచారించగా అధికారులు చెబితేనే అలా చార్జీలు వసూలు చేశామన్నారు. గరుడ ప్లస్ చార్జీలు రూ. 350 తీసుకుని మిగిలింది ఇవ్వాలని ఏఎంవీఐ సందాని మహ్మద్ సూచించారు.

Latest Updates