VROలను వేరే శాఖల్లో కలపొద్దు…

వీఆర్వోలను ఇతర శాఖల్లో కలిపే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్​డిమాండ్‌‌‌‌ చేశారు. గత ఏడాది భూ రికార్డుల ప్రక్షాళనను విజయవంతం చేశారని రెవెన్యూ ఉద్యోగులకు బోనస్‌‌‌‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌‌‌‌.. ఇప్పుడు అభాండాలు వేయడం సరికాదన్నారు. ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉన్న లోపాలే రైతులకు, ఉద్యోగులకు మధ్య గొడవలకు కారణమయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌‌‌‌ లక్డీకపూల్‌‌‌‌లోని వాసవి భవన్‌‌‌‌లో బుధవారం నిర్వహించిన ‘రెవెన్యూ  ఉద్యోగుల సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో భూ రికార్డులను పంచాయతీలకు అప్పగిస్తే అవన్నీ తారుమారయ్యాయని, ఆ తప్పులను ఇంకా సరిచేస్తూనే ఉన్నామన్నారు.

చట్టాల్లో మార్పులను స్వాగతిస్తున్నామని, చట్టాల రూపకల్పనలో తమను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. రెవెన్యూ చట్టంపై కలెక్టర్లతో పలుచోట్ల సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం దాపరికం ఎందుకు ప్రదర్శిస్తుందో చెప్పాలని డిమాండ్​ చేశారు. తమది ప్రభుత్వ అనుకూల సంఘమనే అపోహ ఉద్యోగుల్లో ఉందని, అది సరికాదన్నారు. ప్రభుత్వమే తమ పాలిట శత్రువుగా మారిందని గోల్కొండ సతీశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పీఆర్‌‌‌‌సీ, ఐఆర్‌‌‌‌ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. వచ్చే నెలలో రెవెన్యూ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ట్రెసా, టీఎన్జీవో నేతలు ఎందుకు స్పందించట్లే?

అంతకు ముందు తెలంగాణ వీఆర్వోల సంఘం వివిధ జిల్లాల బాధ్యులు కొందరు మాట్లాడుతూ వీఆర్వోల గురించి పలుమార్లు సీఎం కేసీఆర్‌‌‌‌ ఇబ్బందికర వ్యాఖ్యలు చేసినా ట్రెసా, టీఎన్జీవో సంఘాల నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కనీసం ఒక స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ కూడా ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఎవరు కలిసి వచ్చినా, కలిసిరాకపోయినా ఉద్యమించాలని రాష్ట్ర నాయకత్వాన్ని వారు కోరారు. ఈ సమ్మేళనంలో తెలంగాణ వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రాజేష్‌‌‌‌, అసోసియేట్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కాందారి భిక్షపతి, వివిధ జిల్లాల బాధ్యులు ఆశయ్య, గట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates