ఇవాళ VROల రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్: VRO ల సంక్షేమ సంఘం ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి.. సాయంత్రం 5.30 నిమిషాల వరకు ఈ సమావేశం జరగనుంది. రెవన్యూ పాలన సంస్కరణలు – సమస్యలు – సూచనలు అనే అంశంపై చర్చిస్తారు. రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గరికే ఉపేంద్రరావు దీనికి అధ్యక్షత వహించనున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సులర్ కుసుంబ సీతారామారావు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, కొందరు సామాజిక వేత్తలు, న్యాయనిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Latest Updates