తెలంగాణ యువజంట ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముందంటే?

తెలంగాణకు చెందిన ఓ యువ జంట కొడైకెనాల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ(26), భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన ఏపూరి నందిని(26) భార్యభర్తలు. వీరు కొడైకెనాల్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు కొడైకెనాల్‌లోని అన్నయ్‌ థెరెస్సా యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ఏడాది కాలంగా నివాసముంటున్నారు. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున కిరాణా సరుకులు సరఫరా చేసే యువకుడు వారి ఇంటికి వెళ్లగా తలుపులు తీయలేదు. ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో లోపలికి చూశాడు. దంపతులిద్దరూ నోట్లో నుంచి నురగలు కక్కి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా అప్పటికే వారు చనిపోయి ఉన్నారు. దంపతుల ఇంట్లో నందిని రాసిన సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపీకృష్ణ దంపతులు కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నారని విచారణలో ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. గత 3 నెలలుగా జీతాలు సరిగా రావడం లేదని చెప్పినట్లు తెలిపాడు. అయితే దంపతులిద్దరూ కొద్దికాలంగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆ ప్రయత్నాలు ఫలించడంలేదన్న బాధతో ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

కాగా.. తమ సూసైడ్ కు పూర్తిగా కారణం తానేనంటూ నందిని తన తల్లికి మూడు పేజీల నోట్ రాసింది. ఆ నోట్ యదావిధిగా మీకోసం..

For More News..

కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

విమానం రెండు ముక్కలైనా.. సేఫ్ గా ఉన్న బ్లాక్ బాక్స్

ఇండియా టుడే సర్వే.. మళ్ళీ ప్రధానిగా మోడీకే పట్టం

ఇండియా టుడే సర్వేలో కేసీఆర్ కి 3 శాతం ఓట్లే

Latest Updates