
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జెన్ కోను సీఎస్ఐ ఈ -గవర్నెన్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ వరించింది. ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్(ఈఆర్పీ) నిర్వహణకు సాప్ ఇండియా భాగస్వామ్యంతో ‘టీఎస్ శక్తి’ని అందుబాటులోకి తెచ్చిన జెన్‌కో దానిని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఎస్‌ఏపీ ఫిల్మ్, మొబైల్ టెక్నాలజీ, డాష్ బోర్డులను ఉపయోగించి జెన్‌కో నిర్వహిస్తోంది. ఈ–ఆఫీస్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా భారీ లావాదేవీలు, డేటా వినియోగం, జలాశయాల్లో నీటి స్థాయిలు, మొబైల్ అప్లికేషన్‌లను సక్సెస్ ఫుల్ గా ఒకే ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా( సీఎస్‌ఐ).. జెన్కోకు అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా టీఎస్ శక్తి టీమ్‌ను జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అభినందించారు.