ఇండియా ఖోఖో టీమ్‌‌లో తెలంగాణ కుర్రాడు

హైదరాబాద్‌‌, వెలుగు: సౌత్‌‌ ఏషియన్ గేమ్స్‌‌ (శాఫ్‌‌)లో  పాల్గొనే  ఇండియా ఖోఖో టీమ్‌‌లో తెలంగాణ ప్లేయర్‌‌‌‌ రాజు చోటుదక్కించుకున్నాడు. 15 మంది సభ్యులతో కూడిన పురుష, మహిళల జట్లను ఖోఖో ఫెడరేషన్ ఆఫ్‌‌ ఇండియా గురువారం ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజు ఒక్కడే ఎంపికవ్వగా.. పురుషుల టీమ్‌‌ను మహారాష్ట్ర ప్లేయర్ బాలాసాహెబ్ పొక్రెడ్ నడిపించనుండగా.. మహిళల జట్టుకు నస్రీన్‌‌  కెప్టెన్‌‌గా వ్యవహరించనుంది.  నేపాల్‌‌లోని ఖాట్మాండు వేదికగా శాఫ్‌‌  గేమ్స్‌‌ ఆదివారం  ప్రారంభంకానున్నాయి.

Latest Updates