తెలంగాణ షార్ట్ ఫిల్మ్​కు నేషనల్ అవార్డ్

తెలంగాణ షార్ట్​ఫిల్మ్​కు జాతీయ అవార్డు దక్కింది. వెస్ట్​బెంగాల్​రాజధాని కోల్​కతాలో ఈ నెల 8 నుంచి 15 వరకు జరిగిన కోల్​కతా ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ‘సమ్మర్​రాప్సోడి’ బెస్ట్​షార్ట్​ఫిల్మ్​ అవార్డును సొంతం చేసుకుంది. గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ పురస్కారం, రూ.5 లక్షల నగదు బహుమతిని డైరెక్టర్​కటికనేని శ్రావణ్​ వెస్ట్​బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. 20 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్​ఫిల్మ్​లో  సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం వేలూరుకు చెందిన  చిన్నారి పూర్ణబోధ నటించాడు.

Latest Updates