టెలిగ్రామ్​లో సైలెంట్​ మెసేజెస్

ఇన్​స్టంట్​ మెసేజింగ్ యాప్​ ‘టెలిగ్రామ్’  కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. సైలెంట్​ మెసేజెస్​తో పాటు యానిమేటెడ్ ఇమేజెస్​ను కూడా యూజర్లు సెండ్​ చేయొచ్చు. సాధారణంగా ఎవరికైనా ఒక మెసేజ్​ పంపితే వాళ్లకు సౌండ్​తో ఒక నోటిఫికేషన్​ వస్తుంది. అలా రాకూడదనుకుంటే వాళ్లు మొబైల్​ను సైలెంట్​ మోడ్​లో పెట్టుకోవాలి లేదా యాప్​ నోటిఫికేషన్స్​ ఆఫ్​ చేసుకోవాలి. కానీ, టెలిగ్రామ్​ సైలెంట్​ఫీచర్​తో ఇవేవీ చేయకుండానే సైలెంట్​గా మెసేజ్​ రిసీవ్​ చేసుకోవచ్చు. దీనికోసం టెలిగ్రామ్​లో యూజర్లు ఒక మెసేజ్​ పంపేటప్పుడు సెండ్​ బటన్​ ప్రెస్​ చేసి, కొద్దిసేపు హోల్డ్​ చేయాలి. ఆ తర్వాత కనిపించే ‘సెండ్​ వితౌట్​ సౌండ్ ఆప్షన్’ సెలెక్ట్​ చేసుకుని, మెసేజ్​సెండ్​ చేయాలి. ఇలా మెసేజ్​ పంపితే రిసీవర్స్​కు స్క్రీన్​పై సైలెంట్​ నోటిఫికేషన్​ మాత్రమే వస్తుంది. ఎలాంటి రింగ్​టోన్​ లేదా సౌండ్​ చేయదు. మెసేజ్​ పంపాలనుకునే వాళ్లు ఏదైనా మీటింగ్​లో ఉన్నారనిపించినా, నిద్రపోయే సమయమైనా ఇబ్బంది కలగకూడదనుకుంటే ఈ ఫీచర్​ద్వారా మెసేజెస్​ పంపొచ్చు. యానిమేషన్​ ఎమోజీలను కూడా టెలిగ్రామ్​ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్​లో పంపే వీడియోలకు ‘థంబ్​నెయిల్స్, టైమ్​స్టాంప్స్’ వంటివి యాడ్​చేయొచ్చు. అంటే ఆ వీడియోలో మీరుంటే ఎక్కడున్నారో చూపెడుతూ థంబ్​నెయిల్​ యాడ్​ చేయొచ్చు. ఒక వీడియోలో ఇంపార్టెంట్​ సీన్ ​దగ్గర టైమ్​స్టాంప్​ వేయొచ్చు. దీనివల్ల టైమ్ వేస్ట్​ అవకుండా నేరుగా అక్కడ్నుంచే వీడియో చూడొచ్చు.

 

Latest Updates