క్రైమ్ పెట్రోల్ నటి ప్రేక్ష మెహతా సూసైడ్

క్రైమ్ పెట్రోల్ నటి ప్రేక్ష మెహతా(25) సోమవారం రాత్రి సూసైడ్ చేసుకుంది. క్రైమ్ పెట్రోల్ షోతో బాగా పాపులర్ అయిన ఆమె.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం ప్రేక్ష ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె గది తలుపులు తీసి చూశారు. అప్పటికే ప్రేక్ష ఉరివేసుకొని వేలాడుతూ ఉంది. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమివ్వడంతో.. పోలీసులు వచ్చి ప్రేక్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేక్ష లాక్డౌన్‌కు ముందు ముంబై నుండి ఇండోర్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కరోనావైరస్ వ్యాప్తి వలన షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. ప్రేక్ష మెహతా తన గదిలో ఒక సూసైడ్ నోట్‌ను కూడా రాసిపెట్టింది.

‘మా ప్రాధమిక దర్యాప్తులో ప్రేక్ష నిరాశతో బాధపడుతోందని తెలిసింది. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం’ అని హీరా నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రాజీవ్ భడోరియా తెలిపారు.

ప్రేక్షకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చివరిసారిగా చేసిన పోస్టు ఆమె మానసిక స్థితిని తెలిపేలా ఉంది. ప్రస్తుతం ప్రేక్ష ఐదవ సీజన్‌లో ఉన్న క్రైమ్ పెట్రోల్‌‌లో నటిస్తోంది. ఆమె లాల్ ఇష్క్ మరియు మేరీ దుర్గా షోలలో నటించింది. కొన్ని రోజుల క్రితం బుల్లితెర నటుడు మన్మీత్ గ్రెవాల్ ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే ఈ ఘటన జరిగింది.

For More News..

టెన్త్ ఫలితాల్లో టాపర్‌గా కూరగాయల రైతు కొడుకు

దేశంలో కొత్తగా 6,387 కరోనా కేసులు

తల్లిపై కిరోసిన్ పోసి నిప్పటించిన కొడుకు

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

Latest Updates