సినీ నటుడు బోస్ కన్నుమూత

హైదరాబాద్ : సినీ నటుడు బోస్‌ కన్నుమూశారు. బోస్‌ తీవ్ర అనారోగ్యంతో గాంధీ హస్పిటల్ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ‘సాహసపుత్రుడు’ సినిమాతో బోస్‌ నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ‘కొదమ సింహం’, ‘ప్రేమఖైదీ’ సినిమాల్లో నటించాడు. పూరి జగన్నాథ్, కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల్లో స్ సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించారు. బోస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Latest Updates