నేను బాగానే ఉన్నా… టెన్షన్‌‌‌‌ పడొద్దు: సునీల్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: తన హెల్త్‌‌‌‌ కండీషన్‌‌‌‌పై  టెన్షన్‌‌‌‌ పడొద్దని సినీ నటుడు సునీల్ అభిమానులను కోరారు. బుధవారం రాత్రి స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్‌‌‌‌లో చేరారు. మరోవైపు ఆయన కండీషన్‌‌‌‌ సీరియస్‌‌‌‌గా ఉందని సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌ అయింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందించిన సునీల్‌‌‌‌ తన హెల్త్‌‌‌‌ కండీషన్‌‌‌‌పై ట్విట్టర్‌‌‌‌లో క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యం బాగుందని ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. శ్రేయోభిలాషులు, అభిమానుల ప్రేమ, మద్దతుతో తాను ఆరోగ్యంగా ఉన్నానన్నారు. అయితే సునీల్‌‌‌‌కు కొద్దిగా జ్వరం, జలుబు, దగ్గు ఉన్నాయని… శుక్రవారం ఆయన పరిస్థితిని పరిశీలించి డిశ్చార్జ్ చేస్తామని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Latest Updates