ఆర్‌‌ఎక్స్ 100 డైరెక్టర్‌‌కు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతికి కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అజయ్ తన ఇంట్లోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. భవ్య క్రియేషన్స్‌తో రూపొందిస్తున్న ఓ మూవీలో పని చేస్తున్న భూపతికి రీసెంట్‌గా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో టెస్టులు చేయించుకోగా వైరస్ పాజిటివ్‌గా తేలింది. త్వరలోనే తన ఆరోగ్యం మెరుగుపడుతుందని అజయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘వచ్చేసింది’ అంటూ ట్విట్టర్‌‌లో ట్వీట్ చేసిన అజయ్‌.. త్వరలోనే కోలుకొని ప్లాస్మా డొనేట్ చేస్తానంటూ మరో ట్వీట్ చేశాడు. ఆర్‌‌ఎక్స్‌ 100 సినిమాతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు అజయ్ భూపతి. తొలి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అజయ్ నుంచి నెక్స్ట్‌ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Latest Updates