కథ చెప్పవా అమ్మమ్మా

‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు’ అంటూ అమ్మమ్మ చెప్పే కథ వినడమంటే పిల్లలకు భలే ఇష్టం. సెలవుల్లో ఊరికి వెళ్లినప్పుడు అమ్మమ్మ ఒడిలో పడుకుని కథలు వింటుంటే.. కొత్త ఊహా ప్రపంచంలో తేలినట్టు అనిపిస్తుంది పిల్లలందరికీ. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు పిల్లల్లో ఎక్కువమంది సెల్ ఫోన్, కంప్యూటర్లలో గేమ్స్ ఆడుకుంటున్నారు. కథలు వినేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇందుకు కారణం ఈతరం అమ్మానాన్నలకు కథలు చెప్పేంత తీరిక లేకపోవడమే. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ధర్మవరపు చాముండేశ్వరి తెలుగు తెలిసిన పిల్లలందరికీ అమ్మమ్మగా మారి కథలు చెప్తున్నారు.

హైదరాబాద్ బోయిన్ పల్లిలోని ప్రైవేట్ స్కూల్ లో ఇరవయ్యేళ్లు టీచర్ గా పని చేశారు చాముండేశ్వరి. తర్వాత పిల్లల కథలు రాసి బుక్స్ పబ్లిష్ చేశారు. ఆపైన కూతురు పద్మప్రియ సలహాతో ఆ పిల్లల కథలకు ఆడియో రూపం ఇచ్చారు. ‘సునో ఇండియా’ అనే పాడ్ కాస్ట్ ప్లాట్ ఫామ్ ద్వారా ‘కథ చెప్పవా అమ్మమ్మా!’ అన్న ప్రోగ్రామ్ తో పిల్లలకు ఆడియో కథలు వినిపిస్తున్నారు. ఆ కథల ద్వారా పిల్లలకు
పర్సనాలిటీ డెవలప్ మెంట్, పర్యావరణం, జంతువులను కాపాడటంపై అవగాహన కల్పిస్తున్నారు.
టీచర్ నుంచి పాడ్ కాస్ట్ హోస్ట్ గా ఎలా మారారు?
మొదట్నించీ నేను సోషల్ టీచర్ గానే పని చేశా. మధ్యలో మా స్కూల్ మేనేజ్ మెంట్ అడిగితే తెలుగు సబ్జెక్ట్ చెప్పడం స్టార్ట్ చేశాను. నాకు తెలుగు భాషపై ఉన్న ఇష్టంతో ఒప్పుకున్నా. హిస్టరీ అయినా సివిక్స్ అయినా.. పిల్లలకు కథలు.. కథలుగా చెప్పడం అలవాటు నాకు. పిల్లలకు ఏది చెప్పినా సింపుల్ గా, అర్థమయ్యేలా చెప్పాలన్నది నా పాలసీ. అందుకే ఏ టాపిక్ నైనా ప్రాక్టికల్ లైఫ్ కి కనెక్ట్ చేస్తూ చెప్పేదాన్ని. నా లైఫ్ ఎప్పుడూ పిల్లలతోనే కనెక్ట్ అయ్యి ఉండేది. స్కూల్లో టీచింగ్ మానేశాక మా మనవలకు కథలు చెప్పడం బాగా అలవాటైంది. ఇలాగే ఇంకొంతమంది పిల్లలకు కూడా చెప్తే బాగుండనిపించింది. అలా ఒకరోజు నా కూతురు ఇచ్చిన సలహాతో పాడ్ కాస్ట్ ద్వారా కథలు చెప్పడం మొదలుపెట్టాను.

ఆడియో ఎంచుకోవడానికి కారణం ఏంటి?
నేను పిల్లల కథలు చాలా రాశాను. వాటన్నింటినీ బుక్స్ గా పబ్లిష్ చేశాను కూడా. కానీ, అవి ఎంతమంది పిల్లలకు చేరుతున్నాయన్నది తెలీదు. కారణం ఈ కాలంలో అమ్మానాన్నలకే పుస్తకాలు చదివేంత తీరిక లేదు. అవి పిల్లలకు ఎలా రీచ్ అవుతాయి అనిపించింది. అందుకే ఆడియో ప్లాట్ ఫామ్ ని ఎంచుకున్నా.టీచింగ్ తర్వాత కొన్ని రోజులు వెబ్ రేడియోలో పనిచేశా. అక్కడ కూడా పిల్లల ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసేదాన్ని.ఆ ఎక్స్ పీరియెన్స్ తోనే ఇప్పుడు పాడ్ కాస్ట్లో కథలు రికార్డ్ చేస్తున్నా. నేను చెప్పే కథలు రికార్డెడ్ . కాబట్టి పిల్లలు కథలు ఎన్నిసా ర్లైనా వినొచ్చు. అదే టీవీ, కంప్యూటర్లు అయితే కళ్లకు
ఎక్కువ శ్రమ ఉంటుంది. పేరెం ట్స్ పిల్లలకు ఫోన్, కంప్యూటర్లలో కథలు పెట్టేసి వెళ్లిపోతే.. పిల్లలు మిస్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఆడియోలో కథ వింటూ.. పెయింటింగ్ లాంటి మల్టీటాస్కింగ్ పనులు చేయొచ్చు.

ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?
‘కథ చెప్పవా అమ్మమ్మా!’ప్రోగ్రామ్ ని 2019లో స్టార్ట్ చేశాం.రోజురోజుకూ రెగ్యులర్ వినేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ మధ్యనే మా శ్రోతల సంఖ్య లక్ష దాటింది.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నా కథలకు విదేశాల్లో కూడా శ్రోతలు ఉన్నారు. అమెరికా, యూకే, సింగపూర్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు శ్రోతల నుంచి రెగ్యులర్ గా ఫోన్ కాల్స్, మెసేజెస్ వస్తుంటాయి.‘మా పిల్లలకు ఈ కథ చాలా ఇష్టం’, ‘ఇందులో నీతి చాలా బాగుంది’ అంటూ ఫీడ్ బ్యా క్ చెప్తుంటారు. త్వరలో కొన్ని కథలను సిరీస్ గా చేయాలని గ్రౌండ్ వర్క్​ చేస్తున్నా.

ఈ పనికి టీచిం గ్ ఎంతవరకు ఉపయోగపడుతోంది?
టీచర్ గా నాకు పిల్లల మెంటాలిటీపై పూర్తి అవగాహన ఉంది. కాబట్టి కథలు రాసేటప్పుడు, చెప్పేటప్పుడు పిల్లల మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకుంటాను. ఎలా చెప్తే వాళ్లకు ఇంట్రెస్టిం గ్ గా ఉంటుంది.. ఎలాంటి ఉదాహరణలు వాడితే వాళ్ల మైండ్ లో రిజిస్టర్ అవుతుందనేది నాకు తెలుసు. అందువల్లే ఎలాంటి టాపిక్ నైనా నేను ఈజీగా మాడిఫై చేయగలుగుతున్నా. ఇదంతా నాకు టీచింగ్ వల్లే సాధ్యమైంది.

మీ కథల్లో వస్తువులేంటి?
‘కాదేదీ కథకు అనర్హం’. అందుకే చిన్న కీటకం నుంచి రాకెట్ వరకు ప్రతిదాన్నీ కథగా చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక కథలో ‘గాలి’కి క్యారెక్టర్ ఇచ్చాను. అందులో గాలి తన గురించి పిల్లలకు చెప్తూ ఉంటుంది. ఒక్కప్పుడు స్వచ్ఛంగా ఉన్న గాలి.. ఇప్పుడు కాలుష్యంగా ఎలా మారిందన్న సంగతి వరకూ అందులో ఉంటుంది. ఇలా పిల్లలకు మెసేజ్ తో పాటు ఎంటర్ టై న్ మెంట్ ఇవ్వడం నా ప్రత్యేకత. ఆడియోల్లో ఆ కథలను పక్కనున్న నా మనవరాళ్లకు చెప్పినట్లే చెప్తాను. అందుకే నేను పిల్లలందరికీ అమ్మమ్మను అయ్యాను. దానికి నేను చాలా గర్వపడుతున్నా.

పాడ్ కాస్ట్ అమ్మమ్మగా, రచయితగా, టీచర్ గా పేరెం ట్స్ కు మీరు ఏమైనా చెప్తారా?
ఈ జనరేషన్ పిల్లలకు ఐ.క్యూ. ఎక్కువగా ఉంటోంది. ఇది సంతోషించాల్సిన విషయమే. అయితే పేరెం ట్స్ చాలా అలర్ట్ గా ఉండటం అవసరం. తెలియాల్సినవి, తెలియకూడనివి కూడా చిన్నవయసులో పిల్లలకు తెలిసిపోతున్నాయి. పేరెంట్స్ కూడా ఉరుకుల పరుగుల జీవితంలో పడి పిల్లలను ఎంగేజ్ చేయడానికి స్మార్ట్ డివైజ్ లను అలవాటు చేస్తున్నారు. టెక్నాలజీని పరిచయం చేయడం మంచి దే. కానీ, అది ఎంతవరకు అన్నది గమనించుకోవాలి. ఎంత సంపాదించినా అది పిల్లల భవిష్యత్తు కోసమే. కాబట్టి, ముందు పిల్లల మోరల్ క్యారెక్టర్, మెంటల్ ఎబిలిటీ పెంచడం ముఖ్యం అని తెలుసుకోవాలి. వాళ్లతో ఎక్కువ టైమ్ గడుపుతూ, ప్రకృతిని పరిచయం చేయాలి. ఎప్పుడూ మార్కులు, ర్యాంకుల గురించే కాకుండా పిల్లల నాలెడ్జ్​ పెంచడానికి
కృషి చేయాలి. పిల్లలకు చాలామంది పేరెంట్స్ ‘గెలుపు’ గురించే చెప్తుంటారు.. అలాకాకుండా ఓటమి గురించి చెప్పాలి. ఓడినవాడికే.. పైకొచ్చే ఛాన్స్ ఉంటుందని నేర్పించాలి. పిల్లలకు పుస్తకాలు (కథలు.. మెల్లిగా జీవిత చరిత్రలు) పరిచయం చేయాలి. కథలు వినడం, చదవడం అలవాటైతే,, వాళ్లకో ఎక్స్ ప్రెషన్ వస్తుంది. అప్పుడు వాళ్లతో మెల్లిగా రాయించాలి. ఇలాంటి వి చేస్తూ ఉంటేనే, పిల్లల ఎదుగుదల బాగుంటుంది.

మీ పర్సనల్ లైఫ్ ..

నా భర్త ధర్మవరపు నాగార్జు న గవర్నమెంట్ టీచర్ గా పనిచేసి రిటైరయ్యారు. మాకిద్దరు పిల్లలు. బాబు విక్రమ్ ఫ్యామిలీతోపాటు అమెరికాలో సెటిలయ్యాడు. కూతురు పద్మప్రియ జర్నలిస్ట్​. ‘సునో ఇండియా డాట్ ఇన్ ’ పాడ్ కాస్ట్​ కో–ఫౌండర్ . ఈ పాడ్ కాస్ట్​ని ఆమె తన భర్త రాకేశ్ , ఫ్రెండ్ తరుణ్ తో కలిసి 2018లో స్టార్ట్​ చేసింది. నా కూతురు ఫ్యామిలీ ఒకప్పుడు ఢిల్లీలో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్​ అయ్యారు. నేను రిటైర్ అయ్యాక పిల్లల కోసం కథలు రాయడం, రికార్డ్ చేయడం వంటి పనులు చేస్తుండటంతో బోర్ అనేమా టే లేదు. వీటిలోనే నాకు సంతోషం ఉంది. సునో ఇండియానే కాకుం డా నా కథలు ఇతర పాడ్ కాస్ట్​ల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

ధర్మవరపు చాముండేశ్వరి, హైదరాబాద్.

Latest Updates